Site icon NTV Telugu

Aamir Khan : మణిరత్నం‌తో ఒక్కసారైనా వర్క్ చేయాలి..

Aamir Khan

Aamir Khan

తరచు వార్తలో నిలిచే బాలీవుడ్‌ స్టార్‌ హీరోలో అమీర్ ఖాన్ ఒకరు. హింది తో పాటు తెలుగు, తమిళం భాషలోనే కాకుండా దక్షిణాదిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన. విభిన్న కథలు, విభిన్న పాత్రలతో ఆడియన్స్‌ని అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ‘సీతారే జమీన్ పర్ ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రజంట్ ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తాజాగా తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Also Read : Sonali Bendre : క్యాన్సర్ నుండి కోలుకోవడానికి కారణం ఆ హీరో ఇచ్చిన ధైర్యం..

అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘సౌత్‌లో నాకు మణిరత్నం సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన మంచి విజనరీ. ఎలాంటి సినిమాలను అయినా చాలా బ్యాలెన్స్ చేయగలరు.. చెన్నై వెళ్ళినప్పుడల్లా ఆయనను కలుస్తుంటాను. ఎన్నో సార్లు మేమిద్దరం కలిసి పని చేయాలని అనుకున్నాం కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఓ సారి మా ఇద్దరి కాంబోలో ‘లజో’ అనే మూవీ కూడా అనుకున్నాం. కానీ, అనుకోని కారణాలతో అది చేయలేకపోయాం. కానీ ఎన్నటికైనా మణిరత్నం గారితో మూవీ చేయాలని ఉంది. అది భవిష్యత్‌లో నెరవేరుతుందనే ఆశ నాకుంది. ’ అంటూ అమీర్ ఖాన్ మణిరత్నం గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version