Aamir Khan: లాలా అమర్‌నాథ్ బయోపిక్‌.. మళ్ళీ ‘లగాన్’ కాంబో రిపీట్ !

Aamir Khan

Aamir Khan

బాలీవుడ్ వెండితెరపై ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి, కానీ అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్’ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఆస్కార్ వరకు వెళ్లి భారతీయ సినిమా గర్వపడేలా చేసింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ పునరావృతం కాబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అమీర్ ఖాన్, తనకి ‘లగాన్’ వంటి క్లాసిక్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్ళీ చేతులు కలపడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా కూడా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉండబోతోందట. భారత క్రికెట్ దిగ్గజం, లెజెండరీ ప్లేయర్ లాలా అమర్‌నాథ్ బయోపిక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. 1947 నాటి పరిస్థితులు, ఆ కాలంలో క్రికెట్ నేపథ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ‘లగాన్’ సినిమా కూడా పీరియాడిక్ డ్రామాగానే వచ్చి సంచలనం సృష్టించింది, ఇప్పుడు మళ్ళీ అదే జోనర్‌లో ఈ ఇద్దరూ సినిమా చేస్తుండటంతో అమీర్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద తన పూర్వ వైభవాన్ని చాటుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.