Site icon NTV Telugu

Aamir Khan : ‘సితారే జమీన్ పర్’ పై అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం..

Ameerkhan

Ameerkhan

ప్రజంట్ OTT సంస్థలు ప్రేక్షకుల‌పై చాలా ప్రభావం చూపుతున్నాయి. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కావడం ఆలస్యం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌ వంటి మేజ‌ర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి. అయితే ముందు నుంచి కూడా ఈ ఓటీటీ‌లపై చాలా మంది నటినటులు నిర్మాతలు, దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ OTT ల కారణంగానే జనాలు ధియెటర్‌కి రావడం మానేశారు. అయితే ఈ విషయం పై చాలా సార్లు రియాక్ట్ అయిన బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read : Allari Naresh : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో అల్లరి నరేష్..

‘సితారే జమీన్ పర్’ మూవీ ఈ జూన్ 20న విడుద‌ల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమిర్, జెనీలియా కీల‌క పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి దివ్య నిధి శ‌ర్మ క‌థ అందించారు. అయితే అమిర్ ఖాన్ ఈ మూవీని థియేటర్లలో విడుదలైన తర్వాత, నేరుగా యూట్యూబ్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. థియేట‌ర్లలోకి విడుద‌లైన ఎనిమిది వారాల త‌ర్వాత దీన్ని నేరుగా యూట్యూబ్‌లోకి  విడుదల చేయనున్నారట. అది కూడా పే-పర్-వ్యూ మోడల్‌లో ఇది ప్రేక్షకుల‌కు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుంద‌ని వార్తలు వ‌స్తున్నాయి.  అంటే ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు యూట్యూబ్‌లో కొంత రుసుము చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌంట్ అవుతుందో చూడాలి.

Exit mobile version