బాలీవుడ్ లో బ్రేకప్‌లు, విడిపోవడాలు, విడాకులు కామన్. ముఖ్యంగా హీరోలు దారుణంగా కోట్లు కోట్లు ఇచ్చి మరి భార్యలను వదిలించుకుంటున్నారు. వయసుతో సంబంధం లెకుండా రిలేషన్ .. డెటింగ్.. పెళ్ళి అని కొత్త జీవితాలు వెతుక్కుంటున్నారు. వీరిలో స్టార్ హీరో అమీర్ ఖాన్ ఒకరు. గౌరీ స్ప్రాట్ తో గత కొద్ది కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు అమీర్ ఖాన్. ఇటీవలే ఈ విషయం బయటపడింది. ఈ ఇద్దరు కలిసి బయట కనిపించడంతో ఈ పుకార్లు మరింత వ్యాపించాయి. పైగా కలిసి ఈవెంట్లలో పాల్గొన్నారు. ఇద్దరు క్లోజ్‌గా మూవ్ అయ్యారు. అయితే తాజాగా తన కొత్త ప్రేమ గురించి అమీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ అయితే ఇచ్చారు..
Also Read : Shiva Rajkumar : శివరాజ్ కుమార్ మెడకు చుట్టుకున్న.. కమల్ వివాదం
‘నేను గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నాను. దాని తర్వాత, నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను. నా ఆరోగ్యంపై దృష్టిపెట్టిన. నా స్నేహితులు కూడా ప్రతి విషయంలోనూ మద్దతుగా నిలిచారు. నిజానికి నేను, గౌరీ అనుకోకుండా కలిశాము. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం.. మొదటి నుంచి కూడా మా మధ్య మొదట్లో ఓన్లీ స్నేహం మాత్రమే ఉంది. కొన్నేళ్ల తర్వాత మా మధ్య ప్రేమ పుట్టింది. నాకు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. వారందరితో రోజంతా గడుపుతాను. దీంతో వైఫ్ అవసరం లేదని భావించేవాడిని. కానీ, ఇప్పుడు గౌరీతో కూడా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు మా మధ్య నిజమైన ప్రేమ ఉంది. మేం భార్యాభర్తలు కాకపోవచ్చు.. కానీ, ఎప్పటికీ కుటుంబంగానే ఉంటాం’ అని అమీర్ ఖాన్ తెలిపారు. పైగా ఏడాదిన్నర నుంచి ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు కూడా అమీర్ తెలిపాడు.
