G. V. Prakash: టాలీవుడ్ ఆడియన్సన్లో ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ఈవెంట్లో జీవీ ప్రకాష్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాను ఇప్పటికే ఈ సినిమా చూశానని, తెలుగు సినీ పరిశ్రమ (TFI) గర్వపడేలా ఈ చిత్రం ఉండబోతోందని ఆయన సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న తన నెక్స్ట్ సినిమా ఇదేనని జీవీ ప్రకాష్ చెప్పారు. హీరో దుల్కర్ సల్మాన్‌తో తనది చాలా ప్రత్యేకమైన కాంబినేషన్ అని గుర్తుచేసుకున్నారు. “గతంలో మా కాంబినేషన్లో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ మా ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా. ఇది కూడా కచ్చితంగా మాకు రెండో బ్లాక్ బస్టర్ అవుతుందనే పూర్తి నమ్మకం నాకుంది” అని జీవీ ప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ అద్భుతమైన కథను అందించిన దర్శకుడు పవన్‌కు జీవీ ప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిర్మాత అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ.. తమిళంలో తన మొదటి సినిమాకు హీరోగా పరిచయం చేసి, తనకు తొలి బ్లాక్ బస్టర్ అందించిన అల్లు అరవింద్ గారు తనకెంతో ప్రత్యేకమని అన్నారు. వైజయంతీ మూవీస్ అశ్వినీదత్, స్వప్న దత్, సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణంల నిర్మాణ విలువలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ సాత్వికతో పాటు రోహిణి, శ్వాసిక వంటి నటీనటులు అద్భుతంగా నటించారని కొనియాడారు. నవంబర్ 20న విడుదల కానున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలన్నారు.

