Aakasamlo Oka Tara: బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంపై మెగా ప్రశంసల వర్షం కురిసింది. ఫస్ట్ షో నుంచే ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదొక ‘స్కై-హై బ్లాక్‌బస్టర్’ అంటూ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆకాశమంత విజయం.. ఆకాశమంత అభినందన’ అంటూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంది. పవన్ సాదినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలోని ఎమోషన్, నటీనటుల పర్ఫార్మెన్స్‌ను మెగా హీరోలు మెచ్చుకోవడంతో టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది. సినిమాకు దక్కుతున్న ఆదరణకు తోడు చిరు, చరణ్ అభినందనలు తోడవ్వడం యూనిట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
మలయాళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైపోయిన దుల్కర్ సల్మాన్, ఈ సినిమాలో తన న్యాచురల్ యాక్టింగ్‌తో మరోసారి మాయ చేశారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి ‘కల్పన’ పాత్రలో జీవించేయగా, శ్రుతి హాసన్, రుహానీ శర్మ తమ పాత్రలతో ఆడియన్స్‌ని మ్యాజిక్ చేశారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఒకవైపు ఆడియన్స్ ఆదరణ, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల ప్రశంసలు రావడంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీ అవుతోంది.
Aakaasamantha Vijayam…Aakasamantha Abhinandana ❤️⭐️
Mega Star #Chiranjeevi garu and Mega Power Star #RamCharan garu appreciated the team of #AakasamloOkaTara and congratulated them on delivering a Sky High Blockbuster 🚀
@KChiruTweets @AlwaysRamCharan ⭐️⭐️
#AOT In Cinemas Now.
Book your Tickets 🎟
https://t.co/NFA7KBYXRE@dulQuer @pavansadineni @shrutihaasan @satveeravalli @iRuhaniSharma @GeethaArts @SwapnaCinema @DQsWayfarerFilm @Lightboxoffl @grajug
@gvprakash @sunnygunnam @ramya_gunnam @sujithsarang #VasantJurru @shreelyricist @TSeries @tseriessouth— Geetha Arts (@GeethaArts) November 29, 2026

