Site icon NTV Telugu

Aadi Saikumar: మహేంద్రన్ నాకు మంచి ఫ్రెండ్.. ‘నీలకంఠ’ను హిట్ చేయండి!

Aadi Saikumar, Mahendran

Aadi Saikumar, Mahendran

పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్.. హీరోగా చేసిన సినిమా ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్ అండ్ గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. నీలకంఠ సినిమా జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. యంగ్ హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ… ‘మహేంద్రన్ నాకు మంచి స్నేహితుడు. ఇద్దరం చెన్నైలో పాండియన్ మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాం. మాతో పాటు హీరోలు సూర్య, కార్తి, ఆర్య కూడా ఫైట్స్ నేర్చుకునేవారు. క్యూ లైన్‌లో మా ముందు సూర్య, కార్తి, ఆర్య ఉండేవారు. నేను, మహేంద్రన్ రిహార్సల్స్ చేసే వాళ్లం. మహేంద్రన్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేశాడు. అతడు మంచి యాక్టర్. మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి గారి చిన్నప్పటి రోల్లో అద్భుతంగా నటించాడు. విజయ్ గారి లాంటి గొప్ప యాక్టర్ నటనను మ్యాచ్ చేశాడు. అక్కడే మహేంద్రన్ ఏంటో నిరూపించుకున్నాడు. నీలకంఠ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. నీలకంఠ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను జనవరి 2న థియేటర్స్ చూసి హిట్ చేయండి’ అని అన్నారు.

Also Read: Hrithik Roshan-Don: గల్లీబాయ్ ప్లేస్‌లోకి గ్రీక్ గాడ్.. నెక్ట్స్ డాన్ హృతిక్ రోషనా?

హీరోయిన్ యష్న ముతులూరి మాట్లాడుతూ… ‘రియల్ లొకేషన్స్‌లో రియల్ ఎమోషన్స్‌తో ఉండే సినిమా ఇది. ఈ సినిమాలో నేను సీత క్యారెక్టర్‌లో నటించాను. శివుడి గురించి ఇటీవల చాలా సినిమాలు వచ్చాయి అని అంటున్నారు. ఇది ఇంకా కొత్తగా ఉంటుంది. శివుడు హాలాహలం తాగినప్పుడు ఆయన శరీరమంతా ఆ విషం నిండకుండా పార్వతీదేవి గొంతు దగ్గరే ఆపిందట. అలా నేను హీరో క్యారెక్టర్‌కు చిన్న సపోర్ట్, బలాన్ని ఇస్తుంటా. తెలుగు అమ్మాయి అయిన నాకు ఇందులో హీరోయిన్‌గా అవకాశం రావడం హ్యాపీగా ఉంది. సీత లాంటి క్యారెక్టర్స్ నేను చేయాలని మా అమ్మ కోరిక. అది ఈరోజు నెరవేరింది. నీలకంఠ సినిమాకు మీరంతా ఇస్తున్న మద్దతుకు థ్యాంక్స్. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version