ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసిన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చింది.
Also Read:Pocso Case : నాలుగేళ్ల చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు.. పోక్సో కేసు
ఈ కార్యక్రమంలో హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘మా టీజర్‌ను రిలీజ్ చేసిన దుల్కర్ గారికి, మాకు సపోర్ట్ చేసిన థమన్, నా స్నేహితుడు సందీప్ కిషన్, ట్రైలర్ రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ గారికి థాంక్స్. మా ప్రమోషనల్ కంటెంట్‌కు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. మేం సినిమా మీద బజ్‌ను క్రియేట్ చేసే క్రమంలోనే ట్రైలర్‌ను ఇంత త్వరగా రిలీజ్ చేశాం. ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ అందరూ కూడా మా ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో మాకు సహకరించిన వంశీ, ప్రమోద్, ప్రసాద్ అన్నలకు థాంక్స్. ట్రైలర్ చూసి కిరణ్ అబ్బవరం అభినందించారు. రానా కూడా మా ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. ఈ మూవీకి తనవంతు సాయం చేస్తానని రానా మాటిచ్చారు. హిందీ రిలీజ్ గురించి కూడా అందరూ అడుగుతున్నారు. మీడియా నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. మా నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో వారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. యుగంధర్ ఈ మూవీని అద్భుతంగా రూపొందించారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. మా చిత్రం కచ్చితంగా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్‌లకు వస్తున్నారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీని మీడియా, ఆడియెన్స్ ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
