Shambala: క్రిస్మస్ బరిలో ఆది పాన్ ఇండియా థ్రిల్లర్ ‘శంబాల’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియో మరియు టీజర్‌తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ అంచనాల నడుమ, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో క్రిస్మస్ సెలవుల బాక్సాఫీస్ రేసులో ‘శంబాల’ ప్రధాన పోటీదారులలో ఒకటిగా నిలిచింది.
Also Read: Dude : డ్యూడ్ సినిమాలో మెరిసిన వివాదాస్పద హీరోయిన్.. ఎవరంటే?
Also Read
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఆది సాయి కుమార్ లుక్, పోస్టర్‌లో కనిపించిన ఓ కుక్క, మరియు వెనకాల పొగతో ఏర్పడిన ఓ వింత ఆకారం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఆకాశాన్నంటే హైప్ క్రియేట్ అయింది. ఈ అంచనాలు ‘శంబాల’ మార్కెట్ విలువను మరింతగా పెంచుతున్నాయి. నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో, ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజువల్ వండర్‌గా ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సీజన్‌లో డిసెంబర్ 25న మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?