NTV Telugu Site icon

Akhanda 2: అఖండ 2లో మరో కుర్ర హీరో.. ఎవరంటే?

Akhanda2

Akhanda2

నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడమే కాదు కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పేరును ‘అఖండ 2-తాండవం’గా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రస్తుతము అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.

Ms.ilayaa : మొదలైన “మిస్ ఇళయా”!

ఈ సినిమా అనే కాదు తాను చేసే సినిమాల్లోని నటీనటుల ఎంపికపై దర్శకుడు బోయపాటి చాలా క్లారిటీగా ఉంటాడు. ఇక ‘అఖండ 2’ కోసం కూడా సెర్చింగ్ మొదలు పెట్టాడు. ఆల్ రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. కాగా తాజాగా ఈ సినిమాలో ఒక కుర్ర హీరో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలెంటడ్ హీరో ఆది పినిశెట్టి అఖండ 2లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ని యూనిట్ చిత్రీకరిస్తోంది. అఖండ 2 సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.