Site icon NTV Telugu

Sentiment Star : ఒక్క డిజాస్టర్ దెబ్బకు 15ఏళ్ల సెంటిమెంట్ ను పక్కన పెట్టిన స్టార్ హీరో

Salmankhan

Salmankhan

కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత 15 సంవత్సరాల నుండి ఫాలో అవుతోన్న ఈద్ సెంటిమెంట్‌ను పక్కన పెట్టేస్తున్నాడట. ఈ పండుగ రోజున తన మూవీస్ రిలీజ్ చేసే అలవాటును పదే పదే రిపీట్ చేస్తున్నాడు సల్లూభాయ్. వాంటెడ్ నుండి రీసెంట్లీ సికిందర్ వరకు సుమారు డజన్ సినిమాలను తీసుకు వచ్చాడు. ఈద్ రోజున సినిమాలు రిలీజ్ చేస్తే అల్లా ఆశీస్సులుంటాయని బలంగా నమ్మే సల్మాన్ ఖాన్  సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో.. నెక్ట్స్ మూవీ రిలీజ్ విషయంలో ఆలోచనలో పడ్డాడట.

Also Read : Sitara entertainments : ఒక బాణం రెండు పిట్టలు.. జాక్ పాట్ కొట్టిన నాగవంశీ

సికిందర్ ప్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ ఆచితూచి ఎంచుకున్న ప్రాజెక్ట్ ‘బాటిల్ ఆఫ్ గాల్వన్’. గాల్వన్ లోయలో చైనా సైనికునితో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లఖియా. ఆ సినిమా రిలీజ్ ఎప్పడన్నది టీం క్లారిటీ ఇవ్వలేదు. కానీ సల్మాన్‌కు ఈద్‌కు తన సినిమాను తెచ్చే అలవాటు ఉన్న నేపథ్యంలో నెక్ట్స్ ఫెస్టివల్‌కు వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారంతా. కానీ కండల వీరుడు ఈ సారి సెంటిమెంట్ తీసి పక్కనపెట్టేస్తున్నాడని టాక్. బాటిల్ ఆఫ్ గాల్వన్‌ను నెక్ట్స్ ఇయర్ జనవరి లేదా జూన్‌లో థియేటర్లలోకి తీసుకు రావాలని అనుకుంటున్నాడ సల్మాన్. షూటింగ్ 55-60 డేస్‌లో కంప్లీట్ చేసి జనవరిలో తేవాలని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అయితే జూన్ గురించి థింక్ చేయాలని చూస్తున్నారట. మేకర్స్ ఆలోచన కూడా ఇలాగే ఉందని తెలుస్తోంది. అయితే బీటౌన్ నుండి అందుతోన్న సమాచారం ప్రకారం.. నెక్ట్స్ రంజాన్ కు ఇప్పటికే మూడు సినిమాలు కర్చీఫ్ వేసేకున్నాయి. ధమాల్ 4, రణవీర్, విక్కీ కౌశల్ లవ్ అండ్ వార్, టాక్సిక్ మార్చి 19, 2026న రిలీజ్ ప్లాన్ చేస్తున్నాయట. ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంది కాబట్టే.. సార్ రావడానికి వెనకాడుతున్నాడన్నది టాక్.

Exit mobile version