తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాంబీ రెడ్డి. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అటు హీరోగా తేజ కు ఇటు దర్శకుడిగా ప్రశాంత్ వర్మ కు మంచి గుర్తింపు తెచ్చింది. జాంబిల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగాను మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ సెన్సేషన్ హిట్ కొట్టింది.
అయితే ఇప్పుడు జాంబీ రెడ్డికి సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. కానీ జాంబీ రెడ్డి- 2 దర్శకత్వ భాద్యతల నుండి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడు. ఈ సీక్వెల్ కు ప్రశాంత్ వర్మ ఓన్లీ కథ మాత్రమే అందిస్తున్నాడు. ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే జాంబీ రెడ్డి సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఆపిల్ ట్రేస్ బ్యానర్ నుండి జాంబీ రెడ్డి 2 చేతులు మారింది. ఈ సీక్వెల్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు. పాన్ ఇండియా భాషలలో భారీ బడ్జెట్ పై గ్రాండ్ స్కేల్ లో ఈ సీక్వెల్ ను నిర్మించనున్నాడు నాగవంశీ. త్వరలోనే ఇందుకు సంబందించిన అధికారక ప్రకటన త్వరలోనే రానుంది. మరోవైపు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ కు సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ కూడా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ను మైత్రీ మూవీస్ సంస్థ వద్దకు చేరిన సంగతి తెలిసిందే.