NTV Telugu Site icon

GameChanger : పోకిరి, ఒక్కడు లాంటి మాస్ ఎంటర్టైనర్ ఈ గేమ్ ఛేంజర్ : శంకర్

Shankar

Shankar

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

Also Read : Jithu Madhavan : కంప్లీట్ స్టార్‌ను డైరెక్ట్ చేయబోతున్న జీతూ

స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.శంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాను. ఇక్కడకు రావాలా? వద్దా? అనుకున్నాను. కానీ మీ అందరి కోసం వచ్చాను. పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. అలాంటి ఓ సినిమానే గేమ్ చేంజర్. తమిళంలో, హిందీలో చిత్రాలు చేశాను. కానీ నేను ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అది జరగలేదు. ఆ తరువాత మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాను. ఆపై ప్రభాస్‌తో కరోనా టైంలో చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఈ గేమ్ చేంజర్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసర్, పొలిటీషియన్ మధ్య వచ్చే ఘర్షణ, వార్ మీదే ఈ చిత్రం ఉంటుంది. రామ్ చరణ్ గారు ఎంతో సటిల్డ్‌గా నటించారు. కాలేజ్ లుక్‌లో చాలా ఫైర్ ఉంటుంది. పంచెకట్టులో అప్పన్నగా అద్భుతంగా నటించారు. సాంగ్స్‌లో అద్భుతమైన డ్యాన్స్‌లతో రామ్ చరణ్ మెస్మరైజ్ చేశారు. ఈ సినిమాకు తమన్ మీద చాలా బాధ్యత, ఒత్తిడి ఉన్న కూడా సూపర్ పాటల్ని ఇచ్చారు. సుకుమార్ పుష్ప 2తో పెద్ద విజయాన్ని అందుకున్నారు. మా కోసం ఇక్కడకు వచ్చిన సుకుమార్ గారికి థాంక్స్. సోషియో, పొలిటికల్, మాస్ ఎంటర్టైనర్‌గా గేమ్ చేంజర్ రాబోతోంది’ అని అన్నారు.

Show comments