NTV Telugu Site icon

‘జోధా అక్బర్’ సెట్స్‌ లో భారీ అగ్ని ప్రమాదం

A Major fire broke out on the permanent set of Jodhaa Akbar

“జోధా అక్బర్” సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు (మే 7)న కర్జాత్‌లోని ఎన్‌డి స్టూడియోలో “జోధా అక్బర్” చిత్రం కోసం నిర్మించిన శాశ్వత సెట్‌ లో మంటలు చెలరేగాయి. మొత్తం సెట్ నిప్పుల్లో కాలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలను అరికట్టడానికి ఫైర్ ఇంజన్లతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘జోధా అక్బర్’. ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ కోసం 2007లో ఈ సెట్ ను నిర్మించారు. తరువాత ఏక్తా కపూర్ నిర్మించిన బుల్లితెర చారిత్రక డ్రామా ‘జోధా అక్బర్’ సీరియల్ షూటింగ్ కూడా 2013- 2014 మధ్య ఇక్కడే చిత్రీకరించబడింది. ఈ కార్యక్రమంలో రజత్ తోకాస్, పరిధి శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ కారణంగా ఎటువంటి సినిమా లేదా సీరియల్స్ షూటింగులు జరగట్లేదు. దీంతో ఆ భారీ సెట్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై నుంచి మంటలు స్టూడియో గోడలను తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ‘జోధా అక్బర్’ సెట్ ను సందర్శకుల కోసం శాశ్వత సెట్‌గా మార్చేశారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఈ సెట్ ను నిర్మించారు.