కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ చిత్ర సినిమాలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తీ చేసుకున్నారు. ఈ సందర్భంగా రజనీ, బాలయ్య అరుదైన సత్కారం అందుకోబోతున్నారు. గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల ముగింపు వేడుకలో రజినీకాంత్, బాలయ్యను ఇఫీ – 2025 సత్కరించనుంది. కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ గోవాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read : Akhanda2Thaandavam : అఖండ – 2.. జాజికాయ.. జాజికాయ.. నువ్వే నా ఆవకాయ..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 1975లో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’తో వెండితెరకు పరిచయమై సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తమిళ చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసి తలైవర్ గా జేజేలు అందుకుంటున్నాడు. తాతమ్మ కల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలయ్య సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలలో నటించి గాడ్ ఆఫ్ మాస్ గా ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పటికి చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా కొనసాగుతు సామజిక సేవా కార్యక్రమల్లోనూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నటించిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు.
