హెచ్ వినోద్ డైరెక్షన్ లో విజయ్ నటించిన జననాయగన్ ఆడియో లాంచ్ డిసెంబర్ 27న మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో జరగనుందనే సమాచారం ఫ్యాన్స్‌లో హైప్ పెంచేసింది. ఇప్పటికే దళపతి కచేరి సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. కాని, దళపతి లాస్ట్ మూవీ కావడంతో ఆడియో లాంచ్ ఈవెంట్‌ని ఫెస్టివల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్టు అనిరుధ్ రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు. భారీ స్టేజ్, ఇంటర్నేషనల్ లైటింగ్ డిజైన్, వేలాది మంది అభిమానుల మధ్య దళపతి కెరీర్‌లో బిగ్గెస్ట్ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట.
Also Read : NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ వేట మొదలు పెట్టారు
పొలిటిక ల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో నే లాస్ట్ సినిమా కావడంతో జీవితంలో మరచిపోలేని సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు అనిరుధ్. ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే డిసెంబర్ 27వరకు ఆగాల్సిందే. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ మూవీ విజయ్ కి పొలిటికల్ మైలేజ్ తీసుకొస్తుందా అనే టాక్ కూడా వినిపిస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు చేస్తున్న లాస్ట్ సినిమాగా జననాయగన్ పై ఎమోషన్, అటెన్షన్ రెండూ మాక్స్‌లో ఉన్నాయి. దళపతి కచేరి సాంగ్‌తో ఇప్పటికే సినిమా హైప్ టాప్ గేర్‌లోకి వెళ్లింది. యాక్షన్, పొలిటికల్ బేస్, స్టార్ పవర్ ఆల్ టుగెదర్ జననాయగన్‌ను బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ వైపు తీసుకెళ్తాయాని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఆడియో ఈవెంట్ తర్వాత హైప్ మరింత రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. భారీ అంచనాల మధ్య వస్తున్న జననాయగన్ ఎంత హంగామా చేస్తుందో చూడాలి.
