Site icon NTV Telugu

Jr.NTR : కేశవనాథేశ్వరనాలయంలో జూ. ఎన్టీయార్.. వీడియో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి

Untitled Design (17)

Untitled Design (17)

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక టూర్ లో ఉన్నారు. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్‌ ను తల్లి షాలిని, భార్య ప్రణతి తో కలిసి దర్శించుకున్నారు. ఇందుకుసంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ” నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది, సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు నేను ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి” అని ‘X’ ఖాతా లో పోస్ట్ చేసాడు తారక్. ఈ పర్యటనలో తారక్ ఫ్యామిలీతో పాటు తారక్ నెక్ట్స్ సినిమా దర్శకుడు కన్నడ స్టార్ దర్శకుడు కెజిఎఫ్ ప్రశాంత్ నీల్, కన్నడ జాతీయ ఉత్తమ పురస్కార అవార్డు గ్రహీత హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.

Also Read: Pawan Kalyan : పడి లేచిన కెరటం.. సామాన్యుడి ధైర్యం.. జనసేనాని ‘పవన్ కళ్యాణ్’..

ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ తో పాటు కెరడి గ్రామ సమీపంలోని కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.
కాంతార సినిమా నటుడు కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి నివాసం ఈ కెరడి గ్రామంలోనే ఉంది. రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి, ప్రశాంత్ నీల్ ఆయన భార్య లిఖిత, జూనియర్ ఎన్టీయార్, సతీమణి లక్ష్మి ప్రణతితో కలిసి కేశవనాథేశ్వర గుహలో కొలువై ఉన్న పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి “నవ్వు, జ్ఞాపకాలు, ఆశీర్వాదాలు మరియు నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రియమైన సోదరుడు JrNTR తో పాటు మూడగల్లు కేశవనాథేశ్వర ఆలయా దర్శనం ఒక శుభప్రదమైన ప్రయాణం” అని ఓ వీడియోను X వేదికక షేర్ చేసాడు రిషబ్ శెట్టి.

 

Exit mobile version