అనంతిక ప్రధాన పాత్రలో ఫణీంద్ర నరసెట్టి డైరెక్షన్‌లో రూపొందిన ఎనిమిది వసంతాలు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్‌కి ముందు దర్శకుడు చేసిన నోటి దురద కామెంట్స్ కారణంగా పెద్దగా ప్రేక్షకులు ఈ సినిమాని పట్టించుకోలేదు.
Also Read:Seethakka : బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు.. సీతక్క కామెంట్స్
థియేటర్లలో ఈ సినిమా ఊహించని డిజాస్టర్‌గా నిలిచింది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించినా, సెకండ్ హాఫ్ విషయంలో చాలామందికి ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లో చూడని ప్రేక్షకులందరూ ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌లో చూసి సినిమా అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read:NTV Exclusive: మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్న టాలీవుడ్ కమెడియన్?
దీంతో కొంతమంది థియేటర్లలో ఉన్నప్పుడేమో దేఖలేదు, ఇప్పుడేమో అద్భుతం అమోఘం అంటూ కామెంట్స్ చేస్తున్నారు, వీళ్లందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి ఉంటే సినిమా హిట్ అయ్యేదేమో కదా అనే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా థియేటర్లలో పెద్దగా వర్కౌట్ కాకపోయినా, ఓటీటీ వాళ్లకు మాత్రం గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ అయి దాదాపు మూడు నాలుగు రోజులు అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
