Site icon NTV Telugu

8 Vasantalu : 8 వసంతాలతో పాటు 12 వసంతాల స్క్రిప్ట్ కావాలా?

8 Vasa

8 Vasa

ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో “8 వసంతాలు” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హనురెడ్డి, రవితేజ ఇతర కీలక పాత్రలలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది, కానీ దర్శకుడి అతి ఆత్మవిశ్వాసంతో కూడిన మాటల వల్ల ప్రేక్షకులు ముందు నుంచి ఈ సినిమా మీద నెగెటివ్ ఇంప్రెషన్‌కు వచ్చేశారు.

Also Read: LORA: “లోరా” ప్రత్యేకత ఏమిటి..? బ్రహ్మోస్ ఉన్నా, ఇజ్రాయిల్ ఆయుధంపై భారత్ ఆసక్తి ఎందుకు..?

ఈ క్రమంలోనే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే, సినిమా విషయంలో తాను విజయం సాధించానని దర్శకుడు మాత్రం చెబుతూ వచ్చారు. అంతేకాక, సినిమా రిలీజ్ తర్వాత తాను ముందు “12 వసంతాలు” అనుకున్నానని, ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత “12 వసంతాలు” స్క్రిప్ట్ కూడా రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే, ఆయన “8 వసంతాలు” స్క్రిప్ట్‌తో పాటు “12 వసంతాలు” స్క్రిప్ట్ కూడా రిలీజ్ చేశారు. గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా ఆ విషయాన్ని ఆయన షేర్ చేశారు. ఔత్సాహికులు ఎవరైనా ఉంటే, ఆ స్క్రిప్ట్‌ను మీరు కూడా చూడొచ్చు.

https://drive.google.com/drive/folders/1NIh6Ym6F9OKWltbVWPZtLB3QM43RpFWD

Exit mobile version