NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప రూలింగ్ ‘కౌంట్ డౌన్‌’ స్టార్ట్.. పోస్టర్ చూసారా..?

Untitled Design (4)

Untitled Design (4)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడ్ సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా  డిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Also Read : Jr NTR : ఇంక ‘దేవర’కు నో ఈవెంట్స్.. కారణం ఇదే..?

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబరు 6 న రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజ్ కు కౌండౌన్ మొదలెడుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కేవలం 75 రోజులు మాత్రమే పుష్ప రాజ్ రూలింగ్ చూడబోతున్నారు అని స్పెషల్ పోస్టర్ ను ఫ్యాన్స్ కోరిక మేరకు విడుదల చేసారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. ఈ సినిమాలో వచ్చే జాతర పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తోందని యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది. అక్టోబర్ చివరి నాటికి టోటల్ సినిమా షూటింగ్ కంప్లిట్ చేసేందుకు లాంగ్ షెడ్యూల్ లో శరవేగంగా షూట్ చేస్తున్నాడు సుక్కు. పుష్ప-2లో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సిక్వెల్ లో వచ్చే ఐటం సాంగ్ లో నటించే భామ ఎవరనేది త్వరలోనే క్లారిటీరానుంది. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.