NTV Telugu Site icon

Rajnikanth: G.O.A.T ను నాలుగు రోజుల్లో లేపేసిన వేట్టయాన్.

Rajni

Rajni

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా వేట్టయాన్. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో  రజనీకి జోడియా మంజు వారియర్ నటించింది.  జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా ఆక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.

Also Read : MechanicRocky : ట్రైలర్ డేట్ వచ్చింది.. సినిమా రిలీజ్ డేట్ మారింది..

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ ఫలితం రాబట్టింది. కానీ టాక్ తో సంబంధం లేకుండా వేట్టయాన్ సూపర్ కల్కేక్షన్స్ రాబడుతోంది. ఇదిలా ఉండగా వేట్టయాన్ ఇటీవల విజయ్ నటించిన G.O.A.T సినిమా కేరళ, ఏపీ, తెలంగాణ రాష్టాల కలెక్షన్స్ ను కేవలం నాలుగు రోజుల్లోనే క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ గోట్ కేరళలో రూ. 31 కోట్ల టార్గెట్ తో బరిలో దిగి అటు అటుగా రూ. 20 కోట్లు నష్టాలు మిగిల్చింది. కాగా వేట్టయాన్ తొలి నాలుగు రోజుల్లో రూ. 12 కోట్లు కలెక్ట్ చేసి గోట్ ఫుల్ రన్ ను బీట్ చేసింది. అలాగే తెలుగు రాష్టాల్లో కూడా మొదటి రోజు రూ. 5.20 కోట్లతో భారీ ఓపెనింగ్ రాబట్టి గోట్ (రూ. 4.17కోట్లు) క్రాస్ చేసింది. దసరా కానుకగ రిలీజ్ అయిన వేట్టయాన్ తెలుగు స్టేట్స్ లో సూపర్ కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది. వరల్డ్ వైడ్ గా కేవలం నాలుగు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది వేట్టయాన్.

Show comments