Allu Arjun: బన్నీ గడ్డానికి అరకోటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
50 Lakhs for Allu Arjun Beard: అల్లు అర్జున్ గడ్డానికి అరకోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి గడ్డానికి అరకోటి ఎవరైనా ఖర్చు పెడతారా? అని మీకు అనుమానం కలగవచ్చు. కానీ పుష్ప 2 సినిమా విషయంలో అదే జరుగుతోంది. ఈ మధ్యకాలంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. అయితే వెకేషన్ కి వెళ్తూ వెళ్తూ అల్లు అర్జున్ గడ్డాన్ని ట్రిమ్ చేయడం ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. షూటింగ్ ముగించకుండానే ఇలా చేసాడంటే డైరెక్టర్ తో ఏవో విభేదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆ తర్వాత బన్నీ వాసు లాంటి వాళ్ళు అదేమీ లేదని షూటింగ్ కి ఇంకా సమయం ఉందని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అలా ట్రిమ్ చేసిన గడ్డాన్ని కవర్ చేయడం కోసమే సుమారు అరకోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సినీ పరిశ్రమలో పెట్టుడు జుట్టు అంటే విగ్గులు, పెట్టుడు మీసాలు, పెట్టుడు గడ్డాలు కొత్తవి కాదు. కాకపోతే అవి పెట్టినట్టు ఈజీగా అర్థమయిపోయేలా ఉంటాయి.
Vishwambhara : త్రిశూలంతో రుద్రనేత్రుడిలా చిరంజీవి.. పోస్టర్ అదిరింది!
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
కానీ పుష్ప విషయంలో ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్ ఈ గడ్డం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే నేచురల్ లుక్ లో గడ్డం కనిపించడానికి ముంబై నుంచి ఒక స్పెషలిస్ట్ ని దింపారట. అతని చేత బన్నీ కోసం పెట్టుడు గడ్డం సెట్ చేయించినట్లు తెలుస్తోంది. దాని ఖరీదు 40 నుంచి 50 లక్షల అయిందట. అదేంటి అంత ఖర్చు ఏంటి అని మీకు అనుమానం కలగవచ్చు. ఈ గడ్డం టెంపరరీ, అంటే మేకప్ తీసి వేసుకున్న ప్రతిసారి ఈ గడ్డంతో కవర్ చేయాల్సి వస్తుంది. దానికి ఆ నిపుణుడు కూడా ఇక్కడ ఉండడం అవసరమేనట. ఆ గడ్డం ఖర్చుతో పాటు సదరు నిపుణుడి ఖర్చు కూడా కలిపి 45 నుంచి 50 లక్షల వరకు అవుతుందని అంటున్నారు. నిన్న మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ఈవెంట్ కి బన్నీ వచ్చాడు. అందులో కూడా పుష్ప స్థాయిలో ఉండాల్సిన గడ్డం లేదు అంటే షూట్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ గడ్డం పెట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు.. మొత్తం మీద పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ గడ్డం కూడా హాట్ టాపిక్ అవుతోంది అని చెప్పక తప్పదు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!