ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సరైనోడుకు 5 ఏళ్ళు. నా కెరీర్‌లో ఒక మైలురాయి ఈ చిత్రం. నా కెరీర్‌లో చిరస్మరణీయమైన చిత్రాలలో ఒకటిగా ‘సరైనోడు’ నిలిచినందుకు దర్శకుడు బోయపాటి శ్రీను,రకుల్ ప్రీత్, కేథరీన్ ట్రెసా, ఆది, థమన్, గీతాఆర్ట్స్… ఇంకా చిత్రబృందం, సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు బన్నీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అవినీతిని సహించలేని హీరో మహాలక్ష్మీ అనే అమ్మాయిని ఒక గ్యాంగ్ స్టర్ నుంచి ఎలా రక్షించాడు అనేదే చిత్రకథ. ఐదేళ్ల క్రితం విడుదలైన ‘సరైనోడు’… ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. బోయపతి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో ఆది పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం సినిమాకు మరో హైలెట్. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు విశేషమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ ‘సరైనోడు’కు 5 ఏళ్ళు…!
