Site icon NTV Telugu

Vijay Devarakonda : లైగర్‌ నుంచి ముచ్చటగా మూడో సాంగ్‌ రేపే

Liger Songs

Liger Songs

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా బీటౌన్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. అయితే.. ఈ సినిమాలో విజయ్‌, అనన్యా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి సాంగ్స్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలను విడదల చేసిని చిత్ర యూనిట్‌ రేపు మరో పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

 

రేపు సాయంత్రం 4 గంటలకు ‘కోకా 2.0’ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్ర యూనిట్‌. అయితే.. ఈ సినిమాలో విజయ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుండగా.. ప్రత్యేకమైన పాత్రలో బాక్సర్‌ మైక్ టైసన్ కనిపించనున్నారు. అంతేకాకుండా.. వీరితో పాటు ఇతర ముఖ్యమైన పాత్రలలో రోనిత్ రాయ్ .. అలీ .. మకరంద్ దేశ్ పాండే కనిపించనున్నారు.

 

Exit mobile version