NTV Telugu Site icon

ముగ్గురు స్టార్ హీరోలు రిలీజ్ చేయనున్న ‘మేజర్’ టీజర్

3 Superstars from 3 languages will launch the Major teaser

యంగ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా, శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ‘మేజర్’. ఈ చిత్రంలో శోభిత ప్రమోద అనే పాత్రలో నటిస్తున్నారు. అడవిశేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ‘మేజర్’ టీజర్ ను విడుదల చేయనున్నారు. అయితే ముగ్గురు స్టార్ హీరోల చేతుల మీదుగా ‘మేజర్’ టీజర్ రిలీజ్ కానుంది. ‘మేజర్’ టీజర్ ను తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేస్తుండగా… హిందీలో కండలవీరుడు సల్మాన్ ఖాన్, మలయాళంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల చేతుల మీదుగా ‘మేజర్’ టీజర్ రిలీజ్ అయితే సినిమాపై అంచనాలు తప్పకుండా ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటికే ఈ మూవీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కాగా ‘మేజర్’ చిత్రాన్ని జూలై 2న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.