NTV Telugu Site icon

28°C : మరో కొత్త థ్రిల్లర్ కథతో రాబోతున్న నవిన్ చంద్ర

Naveen Chandra

Naveen Chandra

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. అందాల రాక్షసి’ మూవీ‌తో  తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్ని, అక్కడి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు నవీన్. హీరోగా మాత్రమే కాకుండా డిఫరెంట్ పాత్రలు కూడా ఎంచుకుంటూ, ఇటు విలన్‌గా కూడా తనని తను నిరూపించుకున్నాడు. ఇక మూవీస్‌తో పాటుగా వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నా నవీన్ చంద్ర తాజాగా ‘28°C’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా,‘పొలిమేర’ మూవీ దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని, వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

Also Read:  Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ అనారోగ్యంతో మృతి…

ఇప్పటికే  ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీ నుండి ‘చెలియా చెలియా..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా, ఈపాటను మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశాడు. కిట్టు విస్సాప్రగడ మంచి లిరిక్స్ అందించాగా సింగర్ రేవంత్ ఆకట్టుకునేలా పాడారు. ఇక తాజాగా  హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ పెట్టి ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను లాంచ్ చేసారు మేకర్స్. ట్రైలర్ తోనే మూవీ పై ఇంట్రెస్ట్ పెంచేశారు. హారర్ థ్రిల్లర్స్‌ని అద్భుతంగా తెరకెక్కించే అనిల్ విశ్వనాథ్ ఈ ‘28 డిగ్రీల సెల్సియస్’ కూడా కొత్త జానర్‌లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా కట్ చేసిన ట్రైలర్ ‘చనిపోయిన వాళ్ళు తిరిగొస్తారా’ అనే డైలాగ్ తో ఎండ్ అయింది. ప్రజంట్ ఈ ట్రైలర్‌ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.