Site icon NTV Telugu

చరణ్ తెరకు పరిచయమై 14 ఏళ్లు.. ఫ్యాన్స్ సంబరాలు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007 సెప్టెంబరు 28న విడుదలైంది. పూరి బర్త్ డే రోజునే ఈ సినిమాను విడుదల చేశారు. కొత్త హీరోలను ఎక్కువగా తెరకు పరిచయం చేసే పూరి.. మెగా హీరోను ఇంట్రడ్యూస్ చేయటంలో కూడా సక్సెస్ అయ్యారు. పూరి పంచ్ డైలాగులు, చరణ్ డాన్స్ తో పాటుగా ఈ సినిమాలో పాటలు హైలైట్ గా నిలిచాయి. చరణ్ సరసన నేహా శర్మ నటించింది.

ఈ సినిమా 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా అభిమానులు ‘నెక్లెస్‌ రోడ్డు సమీపంలో రామ్‌ చరణ్‌ బొమ్మని గీసి, దానికి రంగులు వేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌’ అని రాసుకొచ్చారు. ‘రాష్ట్ర రామ్‌ చరణ్‌ యువశక్తి’ ఆధ్వర్యంలో సాగిన ఈ వేడుకలో పలువురు అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఇక సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ జోష్ కనిపిస్తోంది.

Exit mobile version