NTV Telugu Site icon

విడుదలైన ‘అరణ్మై 3’ మోషన్ పోస్టర్!

Here’s the Aranmanai3 First Look

వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుందర్ సి ఆ తర్వాత హారర్ జోనర్ వైపు అడుగులేశాడు. నటి ఖుష్బూ భర్త అయిన సుందర్ రూపొందించిన తమిళ చిత్రాలు కొన్ని తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. అయితే.. హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ‘అరణ్మై’ చిత్రం తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో డబ్ కాగా, దాని సీక్వెల్ ‘అరణ్మై -2’లో త్రిష కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ తెలుగులో ‘కళావతి’గా వచ్చింది. తాజాగా ఈ సీరిస్ లోనే మూడో చిత్రాన్ని సుందర్ సి తెరకెక్కించారు. ‘అరణ్మై -3’గా రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఆర్య, సుందర్ సి., ఆండ్రియా, రాశీఖన్నా, కోవై సరళ, సంపత్, నందిని, మనోబాల, సాక్షి అగర్వాల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. గురువారం విడుదలైన ఈ మూవీ పోస్టర్ చూస్తే… ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ సైతం ఇందులో కీలక పాత్ర పోషించారని అర్థమౌతోంది. అవని సినీమాక్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా హక్కుల్ని బెంజ్ మీడియాకు చెందిన ఏసీఎస్ అరుణ్ కుమార్ సొంతం చేసుకున్నారు.