బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ లైఫ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. అయితే, దాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చుకోబోతున్నాడు మన ‘గల్లీ బాయ్’! కలర్స్ ఛానల్లో రణవీర్ సరికొత్త గేమ్ షో హోస్ట్ చేయబోతున్నాడు. ‘ద బిగ్ పిక్చర్’ పేరుతో జనం ముందుకు రానున్న రియాల్టీ షో రణవీర్ ని తొలిసారి బుల్లితెర మీదకు తీసుకురాబోతోంది. అయితే, ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘ద బిగ్ పిక్చర్’కి మరో సూపర్ స్టార్ నిర్మాత! అతనే సల్మాన్ ఖాన్…
కలర్స్ ఛానల్ తో కలసి సల్మాన్ ‘ద బిగ్ పిక్చర్’ గేమ్ షో సమర్పించబోతున్నాడు. అయితే, ఈ షో గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటికే వచ్చేసింది. రణవీర్ తన ఫస్ట్ టెలివిజన్ ప్రొగ్రామ్ గురించి వెరైటీగా వివరిస్తూ ఓ టీజర్ కూడా విడుదల చేశాడు. ‘తస్వీర్ సే తఖ్త్ దీర్ తఖ్’ అంటూ కాన్సెప్ట్ వివరించాడు. ప్రశ్నలన్నీ బొమ్మల రూపంలో ఉంటాయట! ఆ చిత్రాల్ని చూసి సరిగ్గా సమాధానం ఇస్తే కోట్ల రూపాయలు మీవేనంటున్నాడు రణవీర్!
కలర్స్ ఛానల్లో త్వరలో ప్రసారం కానున్న యునీక్ క్విజ్ షో… ‘ద బిగ్ పిక్చర్’ గురించి స్పందిస్తూ… బుల్లితెరపైకి రావటం ఆనందంగా ఉందని అన్నాడు రణవీర్.
