Site icon NTV Telugu

ఏప్రిల్ 16న ‘సెహరి’ టీజర్

Sehari Teaser will be release on April 16th

హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 16న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. దీంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.

Exit mobile version