Site icon NTV Telugu

Tollywood Bundh : సినీ కార్మికుల 18వ రోజు సమ్మె.. సమ్మె విరమించే ఆలోచనలో కార్మిక సంఘాలు

Tollywood

Tollywood

టాలీవుడ్ సిని కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. వారం రోజుల్లో ముగుస్తుందనుకున్న ఈ సమ్మె మూడు వారాలుగా సాగుతూనే ఉంది. కానీ పరిష్కారం అయితే లభించలేదు. ఈ నేపధ్యంలో సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకోనుంది. నిన్న సినీ కార్మిక సమ్మె పై ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ తో చర్చించిన ప్రభుత్వ ఉన్నతాధికారుల పలు సూచనలు చేసారు.  ప్రభుత్వం చేసిన సూచనల పట్ల ఫెడరేషన్ నాయకులు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

Also Read : The Rajasaab : రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ కన్ఫామ్ చేసేసారుగా?

ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఫెడరేషన్ నాయకుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ మీడియా సమావేశంలో రేట్ కార్డ్ అనౌన్స్ చేయనున్నారు ఫెడరేషన్ నాయకులు. వేతనాలు పెంపును 30పర్సెంట్ కాకుండా ఇంకా తక్కువ కి రేట్ కార్డ్ రెడీ చేస్తున్నారు 13 యూనియన్ నాయకులు. నిన్నటీ వరకు 30 పర్సెంట్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టిన ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వ జోక్యం తర్వాత సవరణలు చేసారు. తెలంగాణ గవర్నమెంట్ జోక్యంతో వెనక్కి తగ్గి 30 పర్సెంట్ కంటే తక్కువ కి రేట్ కార్డ్ ప్రిపేర్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే రేట్ కార్డ్ అనౌన్స్ చేసి సమ్మె విరమించే ఆలోచనలో కార్మిక సంఘాలు ఉన్నాయి. మరి ఈ రోజు జరగబోయే చిరుతో భేటీ తర్వాత ఫెడరేషన్ నాయకులు నిర్వహించే ప్రెస్ మీట్ లో బంద్ విరమించే స్టేట్మెంట్ ఇస్తారేమో చూడాలి. అటు నిర్మాతలు కూడా సమ్మె త్వరగా ముగిసి షూటింగ్స్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు.

Exit mobile version