Site icon NTV Telugu

Tollywood : సినీ కార్మికుల 8వ రోజు సమ్మె అప్డేట్.. అవి కూడా బంద్

Tollywood

Tollywood

నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ పూర్తిగా బంద్ కాబోతున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ డిమాండ్స్ కు ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో షూటింగ్ లు బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది ఫిలిం ఫెడరేషన్. ఫిలిం ఫెడరేషన్ కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతలకు చెందిన సినిమాల షూటింగ్స్ కుడా బంద్ ప్రకటించారు.  శుక్రవారమే ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశం. నేటి నుంచి షూటింగ్స్ఎ క్కడిక్కక్కడే నిలచిపోనున్నాయి.

నిర్మాతల పెట్టిన కండిషన్స్ కు ఫెడరేషన్ ఒకే అంటేనే వేతనాలు పెంచుతామని చెప్పిన నిర్మాతలు. 30 శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని చెప్పిన ఫెడరేషన్ నాయకులు. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం మాకు అంగీకారం కాదు అని తేల్చి చెప్పిన ఫెడరేషన్. నిర్మాతలు కొన్ని యూనియన్లను విడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. పీపుల్స్ మీడియా నిర్మాత టీ జి విశ్వప్రసాద్ సినీ కార్మికులకు క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుపడుతున్నారు ఫెడరేషన్ నాయకులు. షూటింగ్స్ బంద్ నేపధ్యంలో నేడు నిర్మాతలు , ఫెడరేషన్ నాయకులతో తెలంగాణా సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి చర్చలు జరపబోతున్నారు. ఫెడరేషన్ నాయకులు ఈరోజు మధ్యాహ్నం తరువాత మంత్రి కోమటి రెడ్డి ని కలిసే అవకాశం ఉంది. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల తో ఈ రోజు చర్చలు జరుపుతామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. మరోవైపు టాలివుడ్ లో నెలకొన్న ఈ వివాదం త్వరలోనే ముగిసి షూటింగ్స్ మళ్ళి స్టార్ట్ అవ్వాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. మరి నేడు జరగబోయే మీటింగ్ లో ఆ దిశగా పరిష్కారం లబిస్తుందో లేదో.

Exit mobile version