RRR: ఆర్ఆర్ఆర్.. అంటూ ఏ ముహూర్తాన రాజమౌళి మొదలుపెట్టాడో.. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ పేరు మారుమ్రోగిపోతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా గురించి మాట్లాడేవారే కానీ, మాట్లాడని వారు కలేరు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మేకర్స్, హీరోస్ ఈ సినిమాపై ప్రశంసల జల్లును కురిపించడం పరిపాటిగా మారిపోయింది. ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ సినిమాపై తాజగా మన ఉరుముల దొర కూడా కామెంట్స్ చేశాడు. అవెంజర్స్ సినిమాలో సూపర్ హీరో ‘థార్’ పాత్రలో కనిపించి వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు క్రిస్ హేమ్స్ వర్త్. తెలుగు ప్రేక్షకులు ఆయనను ముద్దుగా ఉరుముల దొర అని పిలుచుకుంటారు అన్న విషయం తెల్సిందే. ఇక రెండేళ్ల క్రితం ఎక్స్ట్రాక్షన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయిన క్రిస్.. తాజాగా ఎక్స్ట్రాక్షన్ 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన క్రిస్.. ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపించాడు.
Shark Attack: తండ్రి ముందే కొడుకును చంపి తిన్న షార్క్.. వైరల్ అవుతున్న భయంకర వీడియో..
“ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమా చూసాను. ఎంతో అద్భుతంగా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన నన్ను చాలా ఆకట్టుకుంది. అవకాశం వస్తే వారితో నటించాలని ఉంది. అదే కనుక జరిగితే ఫెంటాస్టిక్” అంటూ చెప్పుకొచ్చాడు. క్రిస్.. టాలీవుడ్ హీరోల గురించి చెప్పడం ఇంత అద్భుతంగా చెప్పడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమా గురించి కానీ, ఒక హీరో నటన గురించి కానీ, చెప్పింది లేదు. క్రిస్ కు ఇండియా అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన .. తన కూతురుకు కూడా ఇండియా అనే పేరు పెట్టాడు. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఉరుముల దొరనే మెప్పించారంటే.. నిజంగా మీరు గ్రేట్ అయ్యా అంటూ చరణ్, తారక్ ను అభిమానులు ప్రశంసిస్తున్నారు.
