Site icon NTV Telugu

Sharwanand : యువీ ఆదుకుంటుందా!?

Sharwanand Turns Doctor for Upasana Konidela

శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే శర్వా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేక పోయింది. దాంతో రాబోయే ‘ఒకే ఒక జీవితం’ సినిమా పై ఆశలు పెట్టుకన్నాడు శర్వానంద్. ఇదిలా ఉంటే శర్వానంద్ డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తోంది. శర్వానంద్‌తో పలు సినిమాల్లో చిందులు వేయించిన రాజుసుందరం చాలా కాలం క్రితం యువి క్రియేషన్స్‌ వారికి ఓ కథ చెప్పాడు. శర్వాతో సినిమా చేయాలనుకున్నా ముందు అనుకున్న సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.

Read Also : Radhe Shyam Pre Release Event : ప్రభాస్ కోసం షూటింగ్ కు స్టార్ హీరో డుమ్మా

ఇప్పుడు శర్వా కూడా ఫ్రీ అవటంతో యువీ క్రియేషన్స్ వీలయినంత త్వరగా పట్టాలెక్కించాలనుకుంటోంది. 2014లో శర్వానంద్ తో సుజీత్ దర్శకత్వంలో ‘రన్ రాజా రన్’ సినిమా తీసింది యువీ సంస్థ. ఆ సినిమా శర్వానంద్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ తెరకెక్కించింది. అది పర్వాలేదనిపించింది. ఇప్పుడు కెరీర్లో హిట్ కోసం శర్వానంద్ అర్రులు చాచి ఉన్నాడు. ఇటీవల కాలంలో విడుదలైన శర్వా సినిమాలేవీ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక పోతున్నాయి. మరి మాతృసంస్థ లాంటి యువీ క్రియేషన్స్ అయినా శర్వానంద్ కెరీర్ ని లైన్ లో పెడుతుందేమో చూద్దాం.

Exit mobile version