టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ఇప్పుడు పోక్సో కేసులో అరెస్టయిన ఘటన సినిమా రంగంలో సంచలనంగా మారింది. గత నెలలో ఆయనపై.. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కృష్ణపై పోక్సో (Protection of Children from Sexual Offences) చట్టం కింద కేసు నమోదైంది. కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ పరారీలోకి వెళ్లిపోయారు. కానీ సాంకేతిక ఆధారాలు – ఫోన్ ట్రాకింగ్, సోషల్ మీడియా లొకేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారంగా అతను బెంగళూరులో తలదాచుకున్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని హైదరాబాద్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.
Also Read : Komalee Prasad : ‘హిట్ 3’ దర్శకుడితో ఇబ్బంది పడ్డా..
ఇది ఆయనపై వచ్చిన మొదటి కేసు మాత్రమే కాదు. గతంలో కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను మోసం చేసినట్లు, వారి నమ్మించి మెసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, అప్పుడు అతడిపై సరైన చర్యలు చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఆరోపణలు రావడంతో, పాత కేసుల పై మళ్లీ విచారణ చేపట్టే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. బాధిత బాలిక తరఫున కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. పోలీసులు బాధితురాలికి మానసిక పరిరక్షణ, కౌన్సిలింగ్, చైల్డ్ వెల్‌ఫేర్ సపోర్ట్ వంటి అన్ని విధాలుగా సహాయంగా ఉంటున్నట్లు సమాచారం.
