Chiyaan Vikram 62: ‘వీర ధీర శూరన్’ అంటూ వచ్చేస్తున్న విక్రమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiyaan Vikram’s Veera Dheera Sooran Unveiled with a Powerful Teaser: విలక్షణమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించటమే కాకుండా జాతీయ ఉత్తమ నటుడిగానూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు చియాన్ విక్రమ్. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. చియాన్ విక్రమ్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేయగా త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటించనున్నారు. విక్రమ్ తో పాటుగా ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, దుసరా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘వీర ధీర శూరన్’లో పక్కా మాస్ అవతార్‌లో చియాన్ విక్రమ్ అభిమానులను మెప్పించటం ఖాయంగా కనిపిస్తుంది. టీం రిలీజ్ చేసిన టీజర్‌ను గమనిస్తే హీరో పేరు కాళి, ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో తను పని చేసుకుంటుంటాడు. అతనితో అంతకు ముందే దెబ్బలు తిన్న విలన్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్కడికి చేరుకుంటారు.
టాలీవుడ్ శ్రీరామనవమి పోస్టర్స్ అన్నీ ఒకే చోట.. మీకోసమే!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తమను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న హీరో అని కన్‌ఫర్మ్ అయితే అతన్ని చంపేయాలనేది వారి ఆలోచన, అయితే విలన్స్ జాడను హీరో పసిగట్టేస్తాడు. అక్కడ పని చేసుకుంటూనే విలన్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తు అప్పటి వరకు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విలన్ చెవికి గాయమయ్యేటట్లు కాల్చడంలో దుండగులు భయంతో పరుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న కస్టమర్ హీరో చేతిలోని గన్ చూసి భయపడుతుంది. కానీ హీరో అదేమీ పట్టించుకోకుండా ఆమె కొన్న సరుకుల ఖర్చు ఎంతయ్యిందనే విషయాన్ని చెప్పటంతో షాపులోని లేడీ కస్టమర్, ఓ పక్క భయం, మరో పక్క ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేస్తుంది. 225 సెకన్ల పాటుండే ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజర్‌లోనే అంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సినిమాలో ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక చియాన్ విక్రమ్ మాస్ అవతార్ కూడా ఒక రేంజ్ లో ఉంది. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!