Vikram: చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో ఆయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన విక్రమ్.. ఇప్పుడు చియాన్ విక్రమ్ గా ఏంటో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్.. కోలీవుడ్ బాహుబలి పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించనున్నాడు. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చోళ రాజు కరికాలుడుగా విక్రమ్ నటన అద్భుతం. ఇప్పుడు ఈ సినిమా రెండవ భాగం ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ లతో పాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.
Nani: వెంకటేష్, నాని మల్టీస్టారర్.. ఏందీ బ్రో ఈ కాంబో..?
ఇక ఈ చిత్ర బృందం మొత్తం ప్రమోషన్స్ కోసమై పయనమైంది. మొదటి భాగానికి చేసినట్లే.. రెండో భాగానికి కూడా ప్రమోషన్స్ ను గట్టిగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. అన్ని ఏరియాలను చుట్టి రావడానికి చోళ రాజ్యం బయలుదేరింది. అలా గాల్లో ఎగిరేముందు.. ఇదిగో ఇలా అందరు ఒక చక్కని ఫోటోలో బందీలుగా మారిపోయారు. ఇక ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరయ్యా.. అంటే.. ఇంకెవరు మన చియాన్ మాత్రమే. త్రిష, ఐశ్వర్య లక్ష్మీ లు క్యాజువల్ డ్రెస్ ల్లోనూ కళకళలాడుతున్నారు. ఇక జయం రవి వైట్ హెయిర్ క్యాజువల్ డ్రెస్ తో, కార్తీ స్టైలిష్ లుక్ లో బావున్నారు. ఇక వీరి మధ్యలో హాలీవుడ్ హీరోలా మెరిసిపోతున్నాడు విక్రమ్. వైట్ అండ్ వైట్ డ్రెస్ .. గుబురు గడ్డం.. హెయిర్ కు బ్యాండ్.. బ్లాక్ గాగుల్స్ తో అదరగొట్టేశాడు. విక్రమ్ వయస్సు 56 ఏళ్లు .. ఆయన కొడుకు ధృవ్ విక్రమ్ వయస్సు 25 ఏళ్ళు.. ఇంకా ఇప్పటికీ విక్రమ్ 25 ఏళ్ల వద్దనే ఆగిపోయాడు. ధృవ్, విక్రమ్ ను పక్క పక్కన పెడితే .. ధృవ్ యే పెద్దవాడు అనుకుంటారు. అంత అల్ట్రా స్టైలిష్ గా ఉన్నాడు విక్రమ్. ఇక ఈ ఫోటో చూసిన వారందరు.. అన్నా.. నీకు పెళ్లీడు కొచ్చిన కొడుకు ఉన్నాడు.. నువ్వే ఇలా ఉంటే ఎలా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ టీమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.