NTV Telugu Site icon

Chiyaan Vikram: జాన్ విక్ రేంజులో చియాన్ విక్రమ్…

Chiyaan Vikram

Chiyaan Vikram

ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్ టాప్ ప్లేస్ లో ఉంటే టాప్ 5లో కచ్చితంగా ఉండే ఇంకో నటుడు చియాన్ విక్రమ్. ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల టాలెంట్ ఉన్న విక్రమ్, ఈ జనరేషన్ చూసిన గ్రేటెస్ట్ టాలెంట్స్ లో ఒకడు. ఎఫోర్ట్ లెస్ యాక్టర్ గా కనిపించే చియాన్ విక్రమ్ కి హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. 2015 నుంచి విక్రమ్ కి సరైన హిట్ లేదు కానీ సినిమాలు చెయ్యడం మాత్రం ఆపట్లేదు. ప్రయోగాలు చేస్తూ పోతే తన మార్కెట్ దెబ్బతింటుంది అనే భయం విక్రమ్ కి ఉండదు అందుకే రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటాడు. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రకి ప్రాణం పోసిన విక్రమ్, మరోసారి అదే పాత్రలో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విక్రమ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. తను ఏ సినిమా చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడు అనే విషయాలని ఫాన్స్ కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విక్రమ్… లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో భాగంగా తన లుక్ మార్చిన విక్రమ్, మోస్ట్ స్టైలిష్ ఫోటోషూట్ చేశాడు. అ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ ‘జాన్ విక్ రామ్’ అనే ట్యాగ్ ని పెట్టాడు విక్రమ్. నిజంగానే ఈ ఫోటోస్ లో స్టైలిష్ గా సూటు వేసుకోని లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్న విక్రమ్ ని చూస్తే జాన్ విక్ గుర్తు రాకమానడు. ఒకవేళ జాన్ విక్ సినిమా ఇండియాలో రీమేక్ చెయ్యాల్సి వస్తే బాబా యాగా రోల్ కి విక్రమ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. ఈ ఆలోచన గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి ఎప్పుడో వచ్చినట్లు ఉంది అందుకే జాక్ విక్ రేంజులో ఉండేలా ‘ధృవ నచ్చితరం’ సినిమాని విక్రమ్ తో ప్లాన్ చేశాడు. ఇటివలే పాచ్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కోసం విక్రమ్ ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీకి మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి.

Show comments