NTV Telugu Site icon

Dhruva Natchathiram: హీరోగారు ఈ ప్రాజెక్ట్ ని అసలు పట్టించుకుంటున్నట్లు లేదుగా

Vikram

Vikram

బాహుబలి ఐదేళ్లు, KGF మూడున్నర ఏళ్లు, RRR రెండేళ్లు… ఇలా పాన్ ఇండియా సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి అవ్వడానికి టైమ్ పట్టడం మాములే కానీ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ధృవ నక్షత్రం సినిమా మాత్రం గత ఏడేళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూనే ఉంది. ఏడేళ్లు అంటే ఇదేదో భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా అనుకోకండి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సొంత డబ్బులతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబ్బటి ధృవ నక్షత్రం సినిమా డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని పనులు కంప్లీట్ చేసుకోని నవంబర్ 20న ధృవ నక్షత్రం సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ అంతా రిలాక్స్ అయ్యారు, అయితే ధృవ నచ్చితరం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, అది వాయిదా పడడం ఇదే మొదటిసారి కాదు.

ఇప్పటికే చాలు సార్లు విడుదల తేదీని అనౌన్స్ చేసి వాయిదా వేశారు. ఈసారి కూడా అలానే జరుగుతుంది అనుకుంటున్నాడో లేక తంగళాన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడో తెలియదు కానీ చియాన్ విక్రమ్, ధృవ నక్షత్రం సినిమాని ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించట్లేదు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాత్రం టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ ధృవ నక్షత్రం సినిమా ప్రమోషన్స్ ని ముందుండి నడిపిస్తున్నాడు కానీ విక్రమ్ కాస్త సైలెంట్ గానే ఉన్నాడు. మరో అయిదు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ధృవ నక్షత్రం సినిమా ప్రమోషన్స్ కి విక్రమ్ కూడా కలిస్తే మరింత బజ్ జనరేట్ అవుతుంది లేదంటే అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉపయోగం లేకుండా పోతుంది.

Show comments