NTV Telugu Site icon

Chiyaan Vikram: ఏజెంట్ ధృవ్ వస్తున్నాడు… ఇది ట్రైలర్ కాదు బ్లేజర్…

Chiyaan Vikram

Chiyaan Vikram

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఒక మూవీని మూడేళ్లు, అయిదేళ్ల పాటు షూటింగ్ చేయడం మాములే. అయితే ఒక సినిమా మాత్రం గత ఏడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇన్నేళ్లుగా సినీ అభిమానులని ఊరిస్తూనే ఉన్న సినిమా ‘ధృవ నచ్చితరం’. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏడేళ్లుగా జరుగుతూనే ఉంది. సెవెన్ ఇయర్స్ అంటే ఇదేదో భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా అనుకోకండి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సొంత డబ్బులతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబ్బటి ధృవ నచ్చితరం డిలే అవుతూ ఉంది. తన దగ్గర డబ్బులు అయిపోయినా, టెక్నీకల్ ఇష్యూస్ వచ్చినా… గౌతమ్ మీనన్ నటుడిగా మారి మరీ తనకి వచ్చి రెమ్యునరేషన్ తో ధృవ నచ్చితరం షూటింగ్ చేస్తున్నాడు. ఒక సినిమా కోసం విక్రమ్ కూడా దర్శకుడికి ఇంత సపోర్ట్ చేయడం గొప్ప విషయం.

గ్లిమ్ప్స్ తో ధృవ నచ్చితరం సినిమాపై అంచనాలని పెంచిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, టీజర్ తో ఏ స్టాండర్డ్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారో ప్రూవ్ చేసాడు. స్పై థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ధృవ నచ్చితరం సినిమా కోసం విక్రమ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ పెరుగుతూనే ఉంది కానీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే ప్రశ్నకి సమాధానం దొరకలేదు ఇన్ని రోజులు. లేటెస్ట్ గా మేకర్స్ ధృవ నచ్చితరం సినిమా నవంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేశారు. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ అంతా రిలాక్స్ అయ్యారు, అయితే ధృవ నచ్చితరం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, అది వాయిదా పడడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలు సార్లు విడుదల తేదీని అనౌన్స్ చేసి వాయిదా వేశారు. మరి ఈసారి అయినా దృవ నచ్చితరం సినిమా చెప్పిన డేట్ కి వస్తుందేమో చూడాలి.

Show comments