తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE’ కు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేసారు.
వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ “1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్ట్‌కు షఫైర్ సూట్ పేరుతో మొదలుపెట్టాం. పెండింగ్‌లో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత. కొత్తగా అప్లై చేసుకునేవారికి సంబంధిత అసోసియేషన్ నుంచి దృవీకరణ పత్రాలు తీసుకొస్తే వాటిని పరిశీలించి మెంబర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మాత్రం భూమి పూజ చేసినప్పటి నుంచి 40 నెలల్లో అన్ని ఎమినిటీస్‌తో పూర్తి చేసి ఇస్తాం. ఇదొక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇకపై చిత్రపురిపై ఎలాంటి అపోహలు ఉండవు’’ అని అన్నారు.
సి కళ్యాణ్ మాట్లాడుతూ “చిత్రపురి కాలనీ అనేది చక్కటి ఆలోచనతో వచ్చిన ప్రయత్నం. చిత్రపురి కాలనీ కోసం మనం ఎంతగానో కష్టపడ్డాము. ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నవారికి అలాగే కొత్త వారికి కూడా ఇప్పుడు చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు రాబోతున్నాయి అనే వార్త సంతోషకరం.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. “అమరావతి, చిత్రపురి కాలనీ సుమారుగా ఒకేసారి మొదలయ్యాయి. మరో మూడు సంవత్సరాలలో పూర్తవుతాయి
మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ.. “తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక కుటుంబం అయితే దానిలో చిత్రపురి కాలనీ ఒక భాగం.
నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. “ప్రపంచంలోనే ఎక్కడా లేని సినిమా వారికి ఒక ప్రత్యేక కార్యం అనేది మనకు ఒకరికి ఉండటం ఒక గర్వకారణంగా తీసుకోవాల్సిన విషయం. వచ్చిన అన్ని సమస్యలను అధిగమించి ఈరోజు చత్రపురి కాలనీ ముందుకు వెళ్లిన చేస్తున్నాము
