NTV Telugu Site icon

Etv Win: ఈటీవీ విన్లో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్

Etv Win Ott Update

Etv Win Ott Update

Chitram Choodara & Pardhu to Stream from Thursday on ETV WIN: ఈ వారం ఓటీటీ రెండు సినిమాలను తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈటీవీ విన్. వరుణ్ సందేష్‌ కీలక పాత్రలో నటించిన క్రైమ్‌ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర, అలాగే తమిళ డబ్బింగ్ పార్ధు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌లను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్‌ చేసింది. మే 9 నుంచి ఈటీవీ విన్‌లో ఈ మూవీలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వరుణ్ సందేష్‌ ‘చిత్రం చూడర’ సినిమాకి ఆర్‌ఎన్‌ హర్షవర్థన్‌ దర్శకుడు. శీతల్‌ భట్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలు ధనరాజ్, కాశీ విశ్వనాథ్, రవిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాను తొలుత థియేటర్‌లో విడుదల చేయాలని భావించారు.

HBD Vijay: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్

అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బీఎం సినిమాస్ పతాకంపై శేషు మారంరెడ్డి, భాగ్యలక్ష్మీ బోయపాటి నిర్మించగా రథన్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవిబాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక పార్థు సినిమాలో మైఖేల్ తంగ‌దురై, స‌న‌మ్‌శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించారు. తమిళ్ డైరెక్టర్ మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఎక‌ల‌వ్య‌న్ పార్థు మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళ మూవీ ఓమై సెన్నై మూవీకి తెలుగు డ‌బ్ వెర్ష‌న్‌గా పార్ధు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఓమై సెన్నై మూవీ 2021లో థియేట‌ర్ల‌లో రిలీజై సైకో కిల్ల‌ర్ మూవీగా ఆకట్టుకుంది. త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.