Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Chiru Nag Are Going To Release For Dussehra

Chiru – Nag: దసరా బరిలో ఆ ఇద్దరు సీనియర్ స్టార్స్!

Published Date :July 9, 2022 , 4:33 pm
By Subbarao N
Chiru – Nag: దసరా బరిలో ఆ ఇద్దరు సీనియర్ స్టార్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

ఈ యేడాది దసరా సీజన్ రంజుగా ఉండబోతోంది. దానికి కారణం ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఆ సీజన్ లో బాక్సాఫీస్ బరిలోకి దిగడమే! అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు కింగ్ అక్కినేని నాగార్జున. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల చిరంజీవి లుక్ ను విడుదల చేసిన సందర్భంలో ‘గాడ్ ఫాదర్’ను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. పర్టిక్యులర్ గా ఏ తేదీ అనేది చెప్పకపోయినా దసరా సీజన్ లో తమ చిత్రం వస్తుందని ప్రకటించారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ కూడా అదే సీజన్ లో అక్టోబర్ 5న రాబోతోంది.

నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ మూవీని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ హై – ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జున తొలిసారి ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తార గుల్ పనాగ్ కీలక పాత్ర పోషించారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఆ సందర్భంగా అక్టోబర్ 5న, దసరా కానుకగా తమ చిత్రం జనం ముందుకు వస్తుందని మేకర్స్ తెలిపారు.

విశేషం ఏమంటే ఇటు చిరంజీవికి, అటు నాగార్జునకు కూడా ఈ రెండు సినిమాలు చాలా కీలకం. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదలై పరాజయం పాలైంది. అలానే నాగార్జున నటించిన ‘బంగర్రాజు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది కానీ బాక్సాఫీస్ బరిలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తరహాలో సందడి చేయలేకపోయింది. దాంతో ఈ యేడాది వస్తున్న తమ రెండో సినిమాపై వీరిద్దరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి దసరా కానుకగా రాబోతున్న ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • GodFather
  • Mohan Raja
  • Nagarjuna Akkineni
  • Nayanthara

తాజావార్తలు

  • Petrol Price Hike: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్‌ పెట్రోల్‌ ధర..

  • Deepika Padukone : మౌనం వీడిన దీపికా.. భర్త రణవీర్ తో కలిసి సందడి

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions