మరోసారి సీఎం జగన్ తో చిరు భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ కొన్ని సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గతకొన్నిరోజుల నుంచి ఏపీ లో టిక్కెట్ ధరల విషయమై చర్చ నడుస్తున్న విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం ఏపీ టిక్కెట్ రేట్లు తగ్గించడంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేయడం, పలువురు ప్రముఖులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని తెలపడం. ఇక వాటన్నింటిని ఆపడానికి ఇండస్ట్రీ పెద్దగా కాకుండా ఇండస్ట్రీ బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ ని కలవడం జరిగాయి. ఆ సమావేశంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సమస్యలను వివరించారు. సినిమా టిక్కెట్ రేట్ల విషయమై మరోసారి ఆలోచించాలని, కరోనా సమయంలో బాగా నష్టపోయిన కళాకారులను ఆదుకోవాలని సీఎం జగన్ గారిని కలిసి మాట్లాడానని, ఆయన సానుకూలంగా స్పందించి ఒక నిర్ణయం తీసుకొంటాను అని చిరు చెప్పారు. అంతేకాకుండా ఈ విషయమై ఇండస్ట్రీలో ఎవరిని మాట్లాడవద్దని తెలిపారు.
ఇకపోతే ఈ సమస్యకు ఏదోవిధంగా చెక్ పెట్టాలనే దృఢ నిశ్చయంతో చిరు ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిరు మరోసారి సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఈ మీటింగ్ గత వారమే జరగాల్సి ఉండగా చిరు కరోనా బారిన పడడంతో వాయిదా పడిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10 న ఈ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో చిరు మరోసారి ఏపీ సినిమా టిక్కెట్ల విషయం గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా సీఎం ని కలిసేముందు సినీ ఇండస్ట్రీ పెద్దలతో చిరు సమావేశం కానున్నారని వార్తలు వస్తున్నాయి. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని సీఎం వద్ద వాటిని కూడా ప్రస్తావించాలని చూస్తున్నారట చిరు. మరి ఈసారైనా చిరు ప్రయత్నం ఫలిస్తుందా..? లేదా ..? అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!