Khaidi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ ఖైదీ. ఈ సినిమానే చిరంజీవికి యూత్ లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న చిరును ఒక్కసారిగా స్టార్ ను చేసేసింది. ఒక రకంగా ఈ మూవీ నుంచే మెగాస్టార్ గా అవతరించాడు. అలాంటి ఖైదీ సినిమా రిలీజ్ అయి నేటికి 42 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి టీమ్ ఈ మూవీపై స్పెషల్ వీడియోను డిజైన్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో మార్పు తీసుకొచ్చిన ఖైదీ అంటూ వీడియోను పంచుకుంది. ఈ సినిమాతోనే చిరంజీవి కెరీర్ ఊపందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి యాక్షన్, మాస్ మేనరిజం, డైలాగులు, డ్యాన్సులు కుర్రకారును ఊపేశాయి.
Read Also : Ramyakrishna : ఆమె కోసం ఏడ్చిన రమ్యకృష్ణ
1982 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమాను కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ మూవీని ముందుగా చిరంజీవి కోసం అనుకోలేదంట. నరసారెడ్డి, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కథను ముందుగా కృష్ణ కోసం అనుకున్నారు. కానీ కృష్ణ చేయలేకపోవడంతో ఈ కథ చివరకు చిరంజీవి దగ్గరకు చేరింది. దీన్నే డెస్టినీ అంటారు కాబోలు. ఏది ఎవరు చేయాలో అది వారి వద్దకే చేరుతుంది అంటే ఇదే. ఈ సినిమాకు డైరెక్టర్ గా రాఘవేంద్రరావును అనుకుంటే చివరకు కోదండరామిరెడ్డి సెట్ అయ్యారు. కేవలం రూ.25లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.70 లక్షల బిజినెస్ చేసి మొత్తం రన్‌లో రూ.4 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టింది. చిరంజీవి ఈ సినిమాకి రూ.1.75 లక్షలు. అలా చిరు కెరీర్ ను మలుపుతిప్పింది ఈ మూవీ.
Read Also : 2026 TVS M1-S: 7-అంగుళాల TFT డిస్ప్లే, 150KM రేంజ్.. టీవీఎస్ మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణకు రెడీ
