Site icon NTV Telugu

Mass Maharaja: చిరుతో రవితేజ ఇట్స్ అఫీషియల్!

Ravi Teja

Ravi Teja

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతీహాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిపోయింది. తాజాగా మొదలైన షెడ్యూల్ కి సంబంధించిన సూపర్ అప్ డేట్ ను మూవీ మేకర్స్ శనివారం ఇచ్చారు. ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం ఎప్పటి నుండో ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఆ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ఇంతవరకూ ప్రకటించలేదు. సమయం వచ్చినప్పుడు, సరైన పద్ధతిలో ప్రకటించాలని వేచి చూసింది. అందుకు ఇదే సరైన సమయంగా దర్శక నిర్మాతలు భావించినట్టు తెలుస్తోంది.

మెగా స్టార్ తో మాస్ మహరాజా జత కలిశారంటూ ఓ చిన్నపాటి టీజర్ ను సాటర్ డే రిలీజ్ చేశారు. ‘ద మాస్ ఫోర్స్ జాయిన్స్ ద మెగా స్టార్మ్’ అనే కాప్షన్ తో ఈ టీజర్ వచ్చింది. మూవీ షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి రవితేజ రేంజ్ రోవర్ లో వచ్చి, చిరంజీవి ఉన్న కారవాన్ తలుపు తట్టగానే మెగాస్టార్ డోర్ తీసి, చెయ్యి ఇచ్చి రవితేజను లోపలికి ఆహ్వానించాడు. ఆ తలుపు వెనుకే ఉన్న దర్శకుడు బాబీ ‘మెగా మాస్ కాంబో బిగెన్స్’ అనడంతో ఈ టీజర్ ముగిసింది. గతంలో చిరంజీవి ‘అన్నయ్య’ మూవీలో రవితేజ తమ్ముడిగా కీలక పాత్ర పోషించాడు. మళ్ళీ ఆ స్థాయిలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. చిరంజీవిని డైరెక్ట్ చేయడం బాబీకి ఇదే మొదటిసారి కాగా రవితేజ ‘పవర్’ అతనికి దర్శకుడిగా తొలి చిత్రం!

 

Exit mobile version