ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. గంటల వ్యవధిలోనే చిత్రబృందం అన్ని ప్రధాన నగరాలను కవర్ చేస్తూ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలకు సిద్ధమవ్వడంతో చిత్రబృందం క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కు సర్వం సిద్ధం అయ్యింది. లాస్ట్ మినిట్ లో కొన్ని రూమర్స్ కారణంగా మేకర్స్ తో పాటు అభిమానులు ఆందోళనకు గురైనా… సోషల్ మీడియా ద్వారా 5 భాషల్లోనూ సినిమా విడుదలకు సర్వం సిద్ధం అంటూ ట్వీట్ చేయడంతో బన్నీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘పుష్ప’ టీంను విష్ చేస్తూ ట్వీట్ చేయడం విశేషం.
Read Also : “పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?
“గుడ్ లక్ ‘పుష్ప’ టీం… మీరందరూ ఈ చిత్రంలో మీ రక్తం, చెమట, గుండె, ఆత్మను ఉంచారు. మీ ప్రయత్నాలన్నీ హృదయపూర్వకంగా అందరి ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాను… డియర్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, ఇంకా చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మరికొన్ని గంటల్లోనే వెండితెరపై పుష్ప రాజ్ హవా స్టార్ట్ కాబోతోంది.
‘పుష్ప’ ప్రారంభమైనప్పటి నుంచి సినిమా ప్రమోషన్లలో మెగా టచ్ అసలు లేదనే చెప్పాలి. ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా మెగా హీరోలు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. దీంతో ‘పుష్ప’రాజ్ కు మెగా సపోర్ట్ లేదా ? అనేది డౌట్ కూడా వచ్చింది. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా హీరోలు కన్పిస్తారేమో అని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. అయితే ఇప్పుడు చిరంజీవి స్వయంగా చిత్రబృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ ట్వీట్ చేయడం బన్నీ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.
