Site icon NTV Telugu

Happy Sri Rama Navami : ఫ్యాన్స్ కు చిరు విషెస్

Srirama Navami

Srirama Navami

ఈరోజు అంటే ఏప్రిల్ 10, ఆదివారం నాడు రామ నవమిని జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో నవమి తిథి నాడు రామ నవమిని జరుపుకుంటారు. త్రేతా యుగంలో అయోధ్యలో రాజు దశరథుడు, కౌశల్యకు శ్రీరాముడు జన్మించగా, ఆ కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకుంటారు హిందువులు. ఈ రోజు పవిత్రమైన రామ నవమితో చైత్ర నవరాత్రి ముగియనుంది. విష్ణువు ఏడవ అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీరాముని పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో ఉన్న భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ పండుగ హిందువులకు పెద్ద వేడుక అని చెప్పాలి. కాగా శ్రీరామ నవమి సందర్భంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అభిమానులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version