Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. మనకు తెలిసిందే కదా చిరంజీవి ఎక్కడ ట్యాలెంట్ ఉన్నా సరే ఎంకరేజ్ చేయకుండా ఉండలేరు. సినిమాల్లో ఆయన ఎదుగుతున్న టైమ్ నుంచే ఎంతో మంది నటులను ఎంకరేజ్ చేశారు. చిరు ప్రోత్సాహంతో ఎదిగిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. నటీనటులు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. కేవలం సినిమాల్లోనే కాదు ఆటల్లో ట్యాలెంట్ చూపించిన వారికి కూడా చిరు ఎంకరేజ్ మెంట్ ఉంటుంది. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిస్తే.. చిరంజీవి పెద్ద పార్టీ ఏర్పాటు చేసి ఆమెను అభినందించారు. ఇండస్ట్రీ ప్రముఖులను పిలిచి మరీ సింధును సన్మానించి మెచ్చుకున్నారు.
Read Also : Anasuya : ఆ హీరో అంటే పిచ్చి.. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకునేదాన్ని
ఇప్పుడు తాజాగా తిలక్ వర్మను తన సినిమా సెట్స్ కు ఆహ్వానించి మరీ సన్మానించారు. ప్లేయర్స్ లేదా యాక్టర్లకు కావాల్సింది ఒక ఎంకరేజ్ మెంట్. అదే చిరంజీవి ఇస్తున్నది. చిరంజీవి మిగతా హీరోల్లాగా తన సినిమాలు తాను చేసుకుంటూ ఉండిపోవచ్చు. ఇలా పనిగట్టుకుని ట్యాలెంట్ ఉన్న వారిని పిలిచి సన్మానాలు చేయాల్సిన అవసరం లేదు కదా.. కానీ ఆయన అలా అనుకోవట్లేదు. తాను కష్టపడి ఎదిగిన వ్యక్తి కాబట్టే ట్యాలెంట్ ఉన్న వారికి ఎంకరేజ్ మెంట్ అనేది ఎంత అవసరమో ఆయనకు బాగా తెలుసు. అగ్ర హీరోగా ఉన్న తన నుంచి ప్రశంసలు వస్తే ఆ ప్లేయర్లు మరింత ధీటుగా ఆడేందుకు ఎంతో కొంత అవకాశం ఉంటుందనేది చిరంజీవి ఆలోచన. అందుకే ట్యాలెంట్ ఉన్న వారిని తన వద్దకు ఆహ్వానించి మరీ ప్రశంసిస్తున్నారు. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అందుకే ఈ విషయంలో మెగాస్టార్ గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్.
Read Also : Chiranjeevi : క్రికెటర్ తిలక్ వర్మకు మెగాస్టార్ సన్మానం..
