NTV Telugu Site icon

Mega Star Chiranjeevi: మెగాస్టార్‌కు సోలో హీరోగా చేయడం ఇష్టం లేదా?

Mega Star Chiranjeevi

Mega Star Chiranjeevi

Mega Star Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా తన ఛరిష్మా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడలేదు. సైరాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా యావరేజ్‌గానే నిలిచింది. గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పలేదు. దీంతో ఆయన ఇతర హీరోలపై అతిగా ఆధారపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన ప్రతి సినిమాలో మరో హీరోకు చోటు కల్పిస్తున్నాడు. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరు నటించిన ప్రతి సినిమాలో మరో పేరున్న హీరో నటించడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి హీరోలు నటించగా.. ఆచార్య సినిమాలో తనయుడు రామ్‌చరణ్‌ను చిరంజీవి తీసుకున్నాడు. గాడ్ ఫాదర్ సినిమాలోనూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను ఇరికించాల్సి వచ్చింది.

Read Also: Andhra Pradesh: వైసీపీలో చేరి తప్పు చేశా.. పరిటాల సునీత కాళ్లపై పడ్డ కార్యకర్త

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోనూ చిరంజీవి మరో ఇమేజ్ ఉన్న హీరోను తన సినిమాలో తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాస్ మహరాజా రవితేజ వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ పాత్ర నిడివి సుమారు 40 నిమిషాల పాటు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అన్నయ్య సినిమాలో చిరు తమ్ముడిగా నటించిన రవితేజ చాలా కాలం తర్వాత మరోసారి మెగాస్టార్‌తో కలిసి నటిస్తుండటంతో వాల్తేరు వీరయ్యపై అంచనాలు పెరుగుతున్నాయి. అదీకాక రవితేజ ధమాకా చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. దీంతో మెగాస్టార్ మూవీకి రవితేజ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ మూవీలోనూ కీర్తి సురేష్ లాంటి క్రౌడ్ పుల్లింగ్ యాక్టర్ నటిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో చిరంజీవికి సినిమాల్లో సోలోగా నటించడం ఇష్టం లేదనే టాక్ నడుస్తోంది.

Show comments